అర్థములు
పుట (1) కరుణాశక్తికల్లోల = దయాశక్తి యొక్క పెద్దతరం గములైన కరుణా, కలితాత్మనే = దయాభావములతో కూడిన మనసు=గల, పరాను గ్రహరూపాయ=ఇతరులను అనుగ్రహించుమూర్తియైన, గురవే = గురువు కొఱకు, కుసుమాంజలిః = పువ్వులదోసిలి.
(2) అనుత్తర మహాసంవిద మభూతికలాత్మనే=సర్వోత్తమ మహాచైతన్య-అనుభవ కళాస్వరూపుడైన, గురుగంధగుణాఢ్యాయ=ఉత్తమగురులక్షణోపేతుడైన గుర వేకుసుమాంజలిః = గురువుకు పుష్పాఞ్జలి.
(3) నిజస్తుతి నమస్కార = ఆత్మస్తుతి నమస్కారములచే, నిరన్తదురహంకృతే = దురహంకారముపోయిన, విద్యాగమరహస్యాయ = విద్యారహస్య - ఆగమ రహస్యముల నెఱింగిన, గురవేకుసుమాంజలిః = గురువు కొఱకు పూలదోసిలి (సమర్పణ).
పుట 2) మహాత్మనారాఘవేణతేన = మహానుభావుడు రఘు వంశజుడు అగు శ్రీరామునిచే, ఏవం కృతప్రసాదాః = ఈ విధముగా అనుగ్రహింపబడిన (విభీషణుడు వానరులు) వారు. సర్వే = అందరు, దేహీ దేహంత్య జన్నివ = అవసానకాలములో దేహమును విడచు దేవుడు. స్వం స్వం గృహం జగ్ముః = తమ తమ గృహములకు వెళ్ళిరి.
3) అర్జున!=అర్జునా! మే=నాకును, తవచ=నీకును, బహుని జన్మాని = చాలజన్మలు, వ్యతీతాని = గడచినవి, తాని అహం వేదసర్వాణి = నేనుఆ అన్ని జన్మలను ఎఱుంగుదును, పరంతప = శత్రువులను తపింపజేయువాడా? త్వం నవేత్థ = నీవు ఎఱుగవు.
పుట 15. చెతః! = ఓ మనసా! త్వం= నీవు. ఇతస్తతో7పి = ఇటునటు, నయాహి = వెళ్ళకు, దేహేంద్రియాద్యైః=శరీరము ఇంద్రియములు మొదలైన వానితో, కర్మనకురుష్వ= పనిచేయకు, త్వం యత్ర కుత్రాపిఉపవిశ్య = నీవుఎక్కడో ఒకచోటకూర్చుండి, నిత్యం= ఎల్లప్పుడు, స్వనిదానం అంతఃవిచారయస్వ= నీమూలమునులోపల వెదకుము.
పుట 18. శాస్త్రాణి అధీత్యఅపి = శాస్త్రములను చదివికూడ, మూర్ఖాఃభవన్తి = మూర్ఖులు అగుదురు, యఃతు క్రియావాన్ = ఎవడైతే పనిచేయు వాడో, సఏవ పురుషః=వాడే పురుషుడు, సుచించితం చ ఔషధం=బాగుగా ఆలోచింపబడిన మందుకూడా, నామమాత్రేణ=పేరు చేతమాత్రమే, అతురాణాం=రోగులకు, ఆరోగం న కరోతి=ఆరోగ్యమును కూర్చదు.
పుట 19. యః సర్వభూతైః విభాతి = ఏది సర్వభూతములలో విరాజిల్లుచున్నదో, ఏషః ప్రాణః హి=ఇదిప్రాణము కదా! ఆత్మక్రీడః=సవికల్ప సమాధి నిష్ఠుడు, ఆత్మ రతిః= నిర్వికల్పసమాధినిష్ఠుడు, క్రియావాన్=పురుషార్థమును సాధించినవాడు, ఏషః బ్రహ్మవిదాం వరిష్ఠః = ఇతడు బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడు.
పుట 23. త్రిపురా పరమేశ్వరీ సమ్రాజ్ఞీ = త్రిపురసందరీదేవి, చితిః ఏవ = శుద్ధచిద్రూపిణి, మహాసత్తా = త్రికాలా బాధ్యసద్రూపణి, అభిన్నాయాం యస్యాం = అఖణ్డా ద్వితీయమైన ఏ శక్తియందు (జగత్తు), విభిన్నవత్ భాసతే = భిన్న భిన్నముగా భాసించునో.
పుట 24. వాగర్ధావివసంపృక్తౌ=శబ్దార్థములవలె ఎల్లప్పుడు కలిసి యున్నవారు, జగతః పితరౌ=ప్రపంచమునకు తల్లి దండ్రులు అయిన, పార్వతీపరమేశ్వరా=పార్వతీ పరమేశ్వరులను, వాగర్థ ప్రతిపత్తయే=శబ్దార్థముల స్ఫూర్తికొఱకు, వందే= నమస్కరించుచున్నాను, ద్వైతిన = జీవేశ్వరాది భేదవాదులు, స్వసిద్ధాంత వ్యవస్థా = తమతమ సిద్ధాన్తములు కట్టుబాటులలో, దృఢంనిశ్చితాః = దృఢ నిశ్చియముకలవారు, పరస్పరం విరుధ్యన్తే = ఒకరితోనొకరుతగవులాడుకొందురు, తైః అయం న విరుధ్య తే = వారితో ఈ అద్వైతి జగడ మాడడు.
పుట26. అనంతనవరత్నవిలసత్=అనేక నవరత్నములచే ప్రకాశించు, కటకకింకిణీఝలంఝలములంఝలరవం = పాదాభరణ ఝలంఝలధ్వనులు కలవాడును, ముకుంద విధిహస్తగత=విష్ణుబ్రహ్మల చేతులలోనున్న, మర్దల లయధ్వని=మద్దెలల లయధ్వనులయొక్క, ధిమిద్దిమిత నర్తనపదం= ధిమిద్దిమితయను పదములు నర్తనమున కలవాడును, శకుంతరథ=పక్షివాహన, (మన్మథ,విష్ణు) బర్హిరథ= కుమారస్వామి, నందిముఖ దంతిముఖభృంగి రిటిసంఘనికటం= నందీశ్వరుడు, గజాననుడు, భృంగి, రిటి మొదలగువారు సమీపమున ఉన్నవాడును, సనక సవరిదన ప్రముఖ వందితపదం = సనకసనందాదులచే నమస్కరింపబడిన పాదములు కలవాడును, పరచిదంబర నటం= పరమేశ్వరుని చిదంబర నటరాజస్వామిని, హృధిభజయ= హృదయమునందుధ్యానింపుము.
పుట 28. అజస్రం=ఎల్లపుడు, ఆస్ఫాలితవల్లకీగుణ=మీటబడిన వీణయొక్కతీగెలచే, క్షతోజ్జ్వలాంగుష్ఠ=ఎఱ్ఱబారిన బొటనవ్రేలియొక్క, నఖాంశుభిన్నయా=గోటికాంతులచే మిశ్రమయిన, పురః ప్రవాళైరివపూరితార్థయా=ముందు పవడములచే నింపబడినసగభాగముకలదియో! అన్నట్లున్న, అచ్ఛస్ఫటికాక్షమాలయా= స్వచ్ఛమైన స్ఫటిక జపమాలచే, విభాంతం = ప్రకాశించుచున్న.
పుట29.చంత్రకలోత్తంస=చంద్రకలశిరోభూషణముగా కలవాడా! అభినవంతే నకించిదపివస్తునయాచే=నీ వస్తువును క్రొత్తగా దేనినియాచింపను, భగవన్= షడ్గుణౖశ్వర్య సంపన్నుడా, మదీయ మేవ స్వరూపం ఆనందం=నా ఆనందస్వరూపమునే, మహ్యందేహి = నాకుఇమ్ము.
పుట 30. ఏకైవసామూర్తిః=పరమేశ్వరుని యొక్క మూర్తి ఒక్కటియే, త్రిధాబిభిదే= ముత్తెరగులుగావేరాయెను, బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపముల ధరించెను, కదాచిత్= ఒకానొకప్పుడు, వీరితో ఒకరు పరుడుగాను తక్కినవారు అపతులుగాను అగుదురు. విష్ణోః హరః ఆద్యఃకదాచిత్=ఒకప్పుడువిష్ణువునకు శివుడుపరుడు, తస్యహరిః ఆద్యః=మఱి యొకప్పుడు శివునకు విష్ణువు ఆద్యుడు, తయోఃవేధాః ఆద్యః=ఇంకొకప్పుడువారికి బ్రహ్మపరుడు, తా అపి ధయః ఆద్యౌ = వారివురు కూడా బ్రహ్మకు పరులగుదురు.
పుట 30. యః యః భక్తః = ఏయేభక్తుడు, యాం యాం తనుం=ఏ యే మూర్తిని, శ్రధ్దయా అర్చితుం ఇచ్ఛతి=శ్రద్ధతో పూజించుటకు ఇచ్చగించునో తస్యతస్య=ఆయాభక్తునకు, అచలాం తమేవశ్రద్ధాం=నిశ్చలమైన అశ్రద్ధనే, అహంవిదధామి=నేను చేయు (ఇచ్చు) చున్నాను.
పుట 31. యథా అగ్నిః ఏకః = ఏ విధముగా అగ్ని ఒక్కడే, భువనం ప్రవిష్టః = లోకమున ప్రవేశించినవాడై, రూపం రూపం ప్రతిరూపః బభూవ=తానుదహించు వివిధ వస్తువుల ఆకారములకు పోలిన ఆకారము కలవాడు అగునో, తధా=అట్లే, సర్వభూతాంతర్మారత్మాపకః=సర్వభూతములందు లోపలఉంటూ ఒకేఆత్మ, రూపం రూపం ప్రతిరూపః =తాను ప్రవేశించే వస్తువుల ఆకారములలో భిన్నభిన్నముగా భాసిస్తూ, బహిశ్చ= వ్యతిరిక్తుడుగాకూడా ఉంటున్నాడు.
(2) యధావాయు రేశః=అగ్నినివలెనే వాయువును కూడ దృష్టాన్తముగా చేసికొని ఆత్మవస్తు స్వరూపమును గ్రహింపతగును.
(3)వశీ=సర్వభూతములను వశమునందుంచుకొనిన, సర్వ భూతాంతరాత్మా= సకలప్రాణులకు అంతరాత్మయైన, ఏకః ఆత్మా= ఒక్కఆత్మయే. ఏకం రూపం = తన ఒక్క రూపమును, బహుధా = నానావిధములుగా, కరోతి భాసింపజేయుచున్నది, తం ఆత్మస్థం = ఆ పరమాత్మను ఆనఆత్మయందున్నదానిని, యే ధీరాః అనుపశ్యన్తి=ఏధీరులు సాక్షాత్కరించుకొనెదరో, తేషాం శాశ్వతం సుఖమ్=వారికి శాశ్వతసుఖము కలుగును. ఇతరేషాం న = తక్కినవారికి శాశ్వత సుఖము లభింపదు.
పుట 32. ఆత్మారామాఃచమునయః=ఆత్మస్వరూపానందము నందు క్రీడించుమునులు, నిర్గ్రంథా అపి=అవిద్యాగ్రంధులు వీడినవారైనను, ఉరుక్రమే=భగవంతునియందు, అహైతుకీం భక్తింకుర్వన్తి=స్వాభావికముగా ఏ ఫలమును కోరకయే భక్తిని చేయుచున్నారు. హరిః = విష్ణువు భగవంతుడు, ఇత్థంభూతగుణః = ఇట్టి గుణములు కలవాడు.
పుట 38. ఆర్క=జిల్లేడు, ద్రోణ=తుమ్మి, ప్రభృతి=మొదలగు, కుసుమైః=పూలచే, తే అర్చనం విధేయం=నీపూజ చేయవచ్చును, స్మరహరః=ఓకామదహనా! తేనఫలం మోక్షసామ్రాజ్యలక్ష్మీః ప్రాప్యం = దానిచే మోక్ష సామ్రాజ్యము పొందవచ్చును. ఏతత్ జానన్నపి=ఇది తెలిసియు. శివశివ=శివశివా ! ఆత్మన్=పరమాత్మా! కాలం వ్యర్థయన్= కాలమును వ్యర్థపుచ్చుచు, ఆత్మ ద్రోహీ=ఆత్మకు ద్రోహము చేసికొనినవాడనై, కరణ వివశః=ఇంద్రియములచే వివశుడైన, భూయసా అధః పతాని= మిక్కిలి క్రిందపడిపోవుదును.
పుట 40. చేతః!=ఓమనసా!, పురతః చంచలతాం విహాయ=ముందు చాంచల్యమునువీడి, కోటిద్వయం సంధాయ=రెండు ప్రకారములను ఏర్పరుచుకొని, తత్ర ఏకత్ర= ఒక్కతక్కెడ ఓసిబ్బిలో, సర్వవిషయాన్ విధేహి=భోగ్యసంపదనంతయు ఉంచుము, అన్నత్ర చ శ్రీపతిం నిధేహి= మఱియొక సిబ్బిలో శ్రీపతిని ఉంచుము, తయోర్మధ్యే = ఆ రెంటిలో, క్వను? ఎచట అస్య = ఈనీకు, హితం = హితము, విశ్రాన్తిః = విశ్రాన్తియో, తద్ ఆలోచ్యతాం = అది ఆలోచింపబడుగాక, యుక్త్యాచ=యుక్తిచేతగానీ, అనుభ##వేన=అనుభవము చేతకానీ, యత్రపరమానందః=ఎచటపరమానందము లభించునో, తత్ సేవ్యతామ్=అది సేవింబడుగాక.
పుట 41. ఆమ్రతరుమూలవసతేః=మామిడిచెట్టు మూలము నివాసముగాగల, ఆదిమపురుపస్య=ఏకామ్రానాథ స్వామికి, నయనపీయుషం=నేత్రామృతము అను, అరబ్ధ¸°వనోత్యవమ్ = ¸°వనవిలాసోత=వమారం భముకాగా, అమ్నాయరహస్యం= వేదప్రతిపాద్య తత్త్వస్వరూపిణియగు అమ్మవారిని, అన్తః అవలంబే = లోపల ధ్యానింతును.
పుట41. భూః = భూమి! అంభాంసి = నీరు, అనలః = అగ్ని, అనిల = వాయువు, అమ్బరం = ఆకాశము, అహర్నాథః = సూర్యుడు, హిమాంశుః = చంద్రుడు, పుమాన్ = పురుషుడు (యజ్వ)
పుట 41.ధరణిమయీం=భూమిరూపములోఉన్న, తరణి మయూం=భూమిరూపములోఉన్న. పవనమయీం=వాయుస్వరూపులైన, గగనదహనహోతృమయీం=ఆకాశ అగ్ని రూపములలోఉన్న, అంబుమయీం=జలత్వరూపములో ఉన్న, ఇందుమయీం= చంద్ర రూపములో ఉన్న, ఆదిమాం అమ్బాం = మొదటి తల్లిని జగన్మాతను, అనుకంపనం = కంపాతీరంలో, ఈక్షే = చూచుచున్నాము.
పుట 42. త్వదన్యః దైవతగణః = ఓ తల్లి! నీకంటే వేరైన దేవతాగణము, పాణిభ్యాం అభయ వరదః=చేతులలో అభయవరద ముద్రలను ధరించియున్నారు, త్వమ్ ఏకా=నీవు ఒక్కతివే, ప్రకటిత వర అభీతి అభినయా! వర=అభయ, అభినయము ప్రకటించుదానవు, న ఏవ అసి=కాకపోతివి, శరణ్య!ఓరక్షకురాలా! లోకానాం=జనులకు, భయాత్ త్రాతుం= భయమునుండి రక్షించుటకు, వాంఛాసమధికం ఫలం దాతుం=కోరిన దాని కంటె అధికఫలమునిచ్చుటకు, తవచరణ ఏవ = నీపాదములే, నిపుణౌహి = సమర్థములుకదా.
పుట 43. తవ=నీయొక్క-, వదనసౌందర్యలహరీ పరీవాహ స్రోతః సరణిరివ=ముఖసౌందర్య ప్రవాహమునకు వాలుగొమ్మవలెఉన్న, సీమంతసరణిః=పాపట, నః క్షేమం తనోతు=మాకు క్షేమమును కూర్చుగాక.
పుట43. శివే! = మంగళప్రదురాలా! ఘనస్నిగ్ధంశ్ల క్షుణం = మిక్కిలి చిక్కన నునుపుగల, తులితదలి తేందీవరవనం = వికసించిన నల్లకలువతోటవలె ఉన్న తన చికుర నికురంబం = నీ కచపాలి (కొప్పు), నః ధ్వాంతం ధునోతు = మా అజ్ఞానమను చీకటిని పోగొట్టుగాక.
పుట 45. కుంకుమ పరాగశోణం=కుంకుమపరాగముచే ఎఱ్ఱనైన, కువలయినీ జారకోరకాపీడం = చంద్రకళా శిరో భూషణముగల, వామాంకారూఢ వల్లభాశ్లిష్టం = ఎడమ తొడ మీద ప్రియురాలిచే ఆలింగితుడైన, గజేంద్రవదనం=గణపతిని, వందే= నమస్కరించుచున్నాను.
పుట 46-1. అమలకమలాధివాసిని = స్వచ్ఛకమలములందు నివసించుదానా! మనసః వైమల్యదాయిని! = మనసు=నకు వైశద్యమును ఇచ్చుదానా ! మనోజ్ఞే = మనోహరమైన దానా! సుందరగాత్రి = అందమైన శరీరము కలదానా! సుశీలే= మంచి శీలము కలదానా! తన చరణాం భోరుహం నమామిసదా = నీ పాద పద్మములకు ఎల్లపుడు నమస్కరింతును.
పుట 46-2. అచలాత్మజా = పార్వతి, దుర్గా = దుర్గ, కమలా = కమల, త్రిపుర = త్రిపుర, ఇతి చేదితాజగతి = అనిలోకములో వేర్వేరు నామములచే పఱగు, యాసా = ఎవ్వతె కలదో, ఆమె, త్వమేవ = నీవే, వాచామీశ్వరి? వాగీశ్వరి = మమసర్వాత్మనా ప్రసీద = నాకు అన్ని విధముల పూర్తిగా ప్రసన్ను రాలవుకమ్ము.
పుట 46-3. త్వచ్చరణాంభోరుహయోః = నీ పాద పద్మము లందు, ప్రణమహీనః = నమస్కరించని, ద్విజాతిః అపిపునః = బ్రాహ్మణుడుకూడా, అనేడమూకః భూయాత్ = చెమిటి, మూగ యగును, దేవీ! = దేవీ ! త్వద్భక్తః సర్వజ్ఞః భవతి = నీ భక్తుడు సర్వజ్ఞు డగును.
పుట 46-4. మూలాధారముఖోద్గత=మూలాధారముయొక్క అగ్రము నుండి బయలు వెడలిన, బిసతంతు నిభ ప్రభాప్రభావతయా=తామరతూడుదారమునుబోలిన కాంతి ప్రభావముతో, విసృతిలిపి వ్రాత = బ్రహ్మలిపి సమూహమునందు, అహిత కరచరణాదికే = ఉంచ బడిన చేతులు కాళ్ళుకలదానా! మమప్రసీద = నాకు ప్రసన్ను రాలవుకమ్ము.
పుట 46-5. వర్ణతనో=వర్ణములు శరీరముగా గలదానా! అమృతవర్ణే=అమృతము చాయకలదానా! నియతమితిభిః=నియమించబడిన బుద్ధిగల, యోగీంద్రైః= యోగీశ్వరులచే, వర్ణితే7పి = వర్ణింపబడినను, నిర్ణీత కరణదూరే=ఇంద్రియములకు అగోచరమైనదానా! దేవీ! = దేవీ! వర్ణయితుం సామర్థ్యందేహి = వర్ణించుటకు సామర్థ్యమును ఇమ్ము.
పుట 46-6. వసుకాసురమౌళిలసత్ = దేవతల యొక్కయు, అసురుల యొక్కయు శిరసు=లందు ప్రకాశించు, మణిప్రభా = మణికాంతులచే, దీపితాంఘ్రియుగళే = ప్రకాశింప జేయబడిన పాదపద్మములు కలదానా, సకలాగమ స్వరూపే=సమస్త వేదములు స్వరూపముగా కలదానా, సర్వేశ్వరీ ! మయిసన్నిధిం విధేహి= నా యందు అధివసింపుము.
పుట 47-1. పుస్తకజపటహస్తే=పుస్తకజపవస్త్రములు హస్తములందు కలదానా, వరదాభయచిహ్నచారుబాహులతే = వరదముద్ర అభయముద్ర బాహులతలందు కలదానా, కర్పూరామలదేహీ = కర్పూరమువలె తెల్లని శరీరము కలదానా, వాగీశ్వరి! మమచేతః = నా మనసు=ను, ఆశు = శీఘ్రముగా, విశోధయ = నిర్మలము చేయుము.
ుపుట 47-2. క్షేమాంబరపరిధానే = పట్టు వస్త్రమును ధరించిన దానా, ముక్తామణిభూషణ = ముత్యములు రత్నములు భూషణములుగా గలదానా, ముదావాసే = సంతోషమునకు నిలయమైనదానా, స్మితచంద్రికావికసిత ముఖేందు బింబే= చిరునగవు వెన్నెలచే వికసించిన ముఖచంద్ర బింబముకలదానా, అమ్బికే= తల్లీ, మమ ప్రసీద = నాకు ప్రసన్న రాలవుకమ్ము.
పుట47-3. విద్యారూపే= విద్యాస్వరూపురాలా, అవిద్యానాశిని = అజ్ఞానమును పోగొట్టుదానా, అన్తరాత్మ విదాం = లోపల ఆత్మను తెలిసికొనిన వారలకు, విద్యోతితౌ = ప్రకాశ##మైనదానా, ఆద్యైః మునిభిః=బ్రహ్మాదులచే, సపద్యజాతైః గద్యైఃస్తుతే=పద్యగద్యములతో స్తుతింపబడినదానా, మమప్రసీద = నన్ను అనుగ్రహింపుము.
పుట 47-4. త్రిముఖి=మూడు ముఖములు కలదానా, త్రయీ స్వరూపే= ఋగ్యజుసా=మములుస్వరూపముగాగలదానా త్రిపురే= త్రిపురా, త్రిదశాభినందితాంఘ్రియుగే = దేవతలచే నమస్కరింపబడిన పాదద్వంద్వము కలదానా, త్రీక్షణవిలసితవక్త్రే = మూడు కన్నులచే ప్రకాశించు ముఖము కలదానా, త్రిమూర్తి మూలాత్మికే=బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మూలమైన దానా.
ుపుట47-5. వేదాత్మకే=వేదస్వరూపులారా, నిరుక్తజ్యోతిష=వ్యాకరణకల్ప శిక్షాఛందసు=లను షడఙ్గములచే రచింపబడిన ఇంద్రియములు కలదానా!
పుట 48-1. త్వచ్ఛరణసరసి = నీ పాదములనెడు సరసు=నందు, జన్మస్థితి మహితధియాం = పుట్టుక నిలుకడలచే శుద్ధమైన బుద్ధికలవారలకు, దోషః నలిప్యతే = దోషము అంటదు. అతః = ఇందువలన, భగవతి=పరమేశ్వరి, త్వయి పరమాంభక్తిం = నీ యందు పరమభక్తిని, మమప్రసీద = నాకు అనుగ్రహింపుము.
పుట48-2. బోధాత్మికే=జ్ఞానస్వరూపురాలా, బుధానాం హృదయాంబుజ చారురంగ నటనపరే=విద్వాంసుల హృదయపద్మములనెడు రంగస్థలమున నటించుదానా! భవభంగకరీం భక్తిం=సంసార దుఃఖమును పోగొట్టుభక్తి, భద్రార్థదే=మంగళ వస్తువుల నిచ్చుదానా, మమప్రసీద = నాకు అనుగ్రహింపుము.
పుట48-3. ఇతి=ఈ విధముగా, యః=ఎవడు, వాగీశస్తవం=సరస్వతీస్తుతిని, జపార్చనాహవన వృత్తిషు=జపపూజా హవనములందు, జపేత్=జపించునో, సఃతువిమలచిత్తవృత్తిః = అతడు స్వచ్ఛమైన చిత్తవృత్తికలవాడై, దేహాపది=అవసానమున, నిత్యశుద్ధంపదంఏతి=మోక్షమును పొందును.
పుట 53. వటమూలనివాసినే=మఱ్ఱి చెట్టు మొదట నివసించు, భగవతేతుభ్యంనమః= పరమేశ్వరుడవు నీకు నమస్కారము, వాగీశాయ=వాక్కులకు అధిపతియగు, మహాజ్ఞానదాయినే మాయినే నమః=ఉత్తమజ్ఞానమును ప్రాసాదించు మహేశ్వరునకు నమసు=.
పుట 53. అహంకర్తా = నేను కర్తను, ఈశ్వరాయభృత్యవత్ కరోమి = స్వామికి భృత్యునివలె చేయుచున్నాను. ఇతిబుద్ధ్యా = అను బుద్ధితో.
పుట 53. ఈశ్వరప్రేరితో7హం కరోమి=ఈశ్వరునిచే ప్రేరింపబడినవాడనై, అహంకరో మితిబుద్ధ్యా=నేసు చేయుచున్నాను అనెడి బుద్ధితో.
పుట 53. మయి సర్వకర్మాణి న అహంకర్తేతి = సత్యస్య ఈశ్వరునియందు సర్వకర్మలను సమర్పించి (నేను కర్తను కాను అని)
స్వతంత్రః పరమేశ్వర ఏవ సర్వకర్తా=స్వతంత్రుడగు పరమేశ్వరుడే అన్నిపనులు చేయువాడు, న అహం కశ్చిత్‌ఇతి నిశ్చిత్య = పరతంత్రుడనైన నేను కానుఅని నిశ్చయించి.
పుట54. అస్మిన్‌లోకే = ఈ లోకములో, సాంప్రతం = ఇప్పుడు, గుణవాన్ = గుణవంతుడు, వీర్యవాన్ = పరాక్రమవంతుడు, కఃను = ఎవ్వడు? దర్మజ్ఞః = ధర్మము తెలిసిన వాడు, కృతజ్ఞః = చేసినమేలును గుత్తెరిగినవాడు, సత్యవాక్యః = సత్యవ్రతుడు, ధృఢవ్రతః = గట్టిదీక్ష (సంకల్పడు) కలవాడు, చారిత్రేణ చ యుక్తః = సదాచారుడు, సర్వభూతేషుహితః = సర్వభూతహితుడు, విద్వాన్ = విద్వాంసుడు, సమర్థః = సమర్థుడు, ప్రియదర్శ నః = మనోహరమైనవాడు, ఆత్మవాన్ = ధృతి-సంతోషము-నిగ్రహము కలవాడు, జతక్రోధః = క్రోధమును జయించినవాడు. ద్యుతిమాన్=కాంతి గలవాడు, అనసూయకః= అసూయలేనివాడు, సంయుగే = యుద్ధమున, జాతరోషస్య = కోపము వచ్చిన ఎవ్వనికి, దేవాశ్చ భిభ్యతి = దేవతలుకూడా భయపడుదురు?
పుట 56. అన్నమయీత్ = స్థూలశరీరమునుండి, అన్నమయం = దేహమును, అథవా= లేదా, చైతన్యాత్ =చైతన్యము నుండి, చైతన్యం=చైతన్యమును, ద్విజవరా= బ్రాహ్మణశ్రేష్ఠా, కిందూరీకఠ్తుం వాంఛసి=దేనిని దూరముగా చేయుటకు గోరుచున్నావు.? బ్రూహి= చెప్పుము, గచ్ఛ గచ్ఛ = వెళ్ళుము దూరముగా వెళ్ళుము అని అనుచున్నావు.
పుట 57. జాగ్రత్ స్వప్నసుషుప్తిషు = అవస్థాత్రయమునందు, యాసంవిద్ = ఏచైతన్యము, స్థిరతరా ఉజ్జృంభ##తే = స్ఫుటముగా ప్రకాశించుచున్నదో, యా = ఏ చైతన్యము, బ్రహ్మాది పిపీలికాంత తనుషు = బ్రహ్మ మొదలుకొని చీమవరకు సర్వశరీరములలో, జగత్యక్షిణీ = లోకసాక్షిగా నెలకొని యున్నదో, సా ఏవ అహం = ఆ చైతన్యమేనేను, దృశ్యవస్తు న చ = దృశ్యమైన జడవస్తువు నేను కాను, ఇతి దృఢప్రజ్ఞా యస్య అస్తిచేత్ = అను జ్ఞానము దృఢముగా ఎవనియందు ప్రకాశించు చున్నదో, సః తు చండాలః అస్తు = వాడు చండాలుడైనాసరే, ద్విజః అస్తు = బ్రాహ్మణుడు ఐనాసరే, మమ గురుః = నాకు గురువు, ఇతి ఏషామనీషా = అను ఈ బుద్ధి(నాకు కలదు)
పుట 59.కిం వచనీయమ్ = ఏమి చెప్పతగును? కిం అవచనీయం = ఏమి చెప్పరాదు? కింరచనీయం = ఏమి రచించదగును? కిం అరచనీయః = ఏది రచించరాదు? కిం పఠనీయం = ఏది చదువతగినది? కిం అపఠనీయం = ఏది చదువరాదు ? కిం భజనీయం = ఏది సేవింపదగినది? కిం అభజనీయం = ఏది సేవింపరానిది? కిం బోద్ధవ్యం = ఏది తెలిసికొనదగినది? కిం అబోద్ధవ్యం = ఏది తెలిసికోనక్కఱలేనిది? కిం భోక్తవ్యం = ఏది తినవచ్చును? కిం అభోక్తవ్యం = ఏది తినరాదు? సర్వత్ర = సదాముక్తినిధానం హంసధ్యానం కర్తవ్యం = అంతట ఎల్లపుడు ముక్తికి స్థానము అగు పరమాత్మ ధ్యానము చేయవలయును.
పుట 60. మమకారః త్యక్తవ్యః = నాది అనుభావము వదలి పెట్టవలయును, యదిత్యక్తుం శక్యతే = వదలి పెట్టుట చేతనైనచో, నోచేత్ = అట్లు కానిచో, కర్తవ్యః మమకారః = మమత్వము చేయవచ్చును, కింతు = కాని, సర్వత్ర కర్తవ్యః = అంతట మమకారం చేయును.
పుట 60. అస్య = ఈ జగత్తునకు, జన్మాది = జన్మస్థితిలయములు, అర్థేషు అన్వయాత్ = ఇతరతః చ = అనువృత్తి వ్యావృత్తులవలన, యతః = ఎవని వలన కలుగుచున్నవో, అభిజ్ఞః = సర్వజ్ఞుడు, స్వరాట్ = స్వప్రకాశుడు, యత్ = ఏ వేదమునందు, సూరయః ముహ్యన్తి = పండితులు కూడా మోహము నొందెదరో, బ్రహ్మ = ఆ వేదమును, యః = ఎవ్వడు ఆదికవయః = హిరణ్యగర్భబ్రహ్మకు హృదా, తేనే = హృదయమునందు స్ఫురింప జేసెనో, యత్ర తేజో వారిమృదాం యధా వినిమయః = ఎచట అగ్ని జలభూములకు ఒకదానిని చూచి మఱియొకటి అను భ్రాన్తి కలుగుచున్నదో, త్రిసర్గ ః = లోకసృష్టి. మృషా = మిధ్యాభూతమో, స్వేనధామ్నా = తనతేజసు=చేత, సదానిరస్త కుహకం = ఎల్లప్పుడు దూరముగా చేయబడిన మాయగల, సత్యం పరం ధీమహి = సత్యమైన అట్టి పరబ్రహ్మను ధ్యానింతుము.
పుట 61. మానవాః = మనుష్యులు, పుణ్యస్య ఫలం ఇచ్ఛన్తి = పుణ్యము యొక్క ఫలమును కోరుచున్నారు. పుణ్యం న ఇచ్ఛన్తి = పుణ్యము చేయరు, పాపఫలం న ఇచ్ఛన్తి = పాపఫలమునుకోరరు, కాని, యత్నతః = అదేపనిగా, పాపం కుర్వన్తి = పాపమును చేయుచున్నారు.
పుట 61. జగత్ర్పభుం=లోకములకు ప్రభువైన, దేవ దేవం=దేవ దేవుడు, అనన్తం = దేశకాలవస్తు పరిచ్ఛేదము లేనివాడు అగు, పురుషోత్తమః=శ్రీ మహావిష్ణువును, నామ సహస్రేణ=విష్ణుసహస్రనామములచే; స్తువన్=స్తుతించుచు, సతతోత్థితః= నిరంతరోద్రుక్తుడయిన, పురుషః=పురుషుడు, సర్వదుఃఖాతిగః చరేత్=అన్ని కష్టముల నుండి విముక్తుడగును.
పుట 62. సర్వధర్మాన్ పరిత్యజ్య = అన్ని ధర్మములను విడనాడి, మాం ఏకం = భగవంతుని ఒక్కని (పరమాత్మను), శరణం వ్రజ = శరణు పొందుము. అహం = నేను, త్త్వాం = నిన్ను, సర్వపాపేభ్యః = అన్ని పాపములనుండి, మోక్షయిష్యామి విడిపించెదను, మాశుచః = శోకింపకుము.
పుట 63. కృష్ణ ఇతి వైష్ణవం మంత్రం = కృష్ణ అను విష్ణు మంత్రమును, శ్రుత్వా = విని, నరః ముక్తః భ##వేత్ = మానవుడు ముక్తి పొందును, సర్వశాస్త్రాణి ఆలోడ్య = శాస్త్రములను అన్నింటిని పరిశీలనా పూర్వకముగా చూచి, పునః పునః విచార్య = మఱల మఱల విచారించి చూడగా, ఇదం ఏకం సునిష్పన్నం = ఇది ఒక్కటి చక్కగా తేలినది, ధ్యేయోనారాయణః సదా = ఎల్లప్పుడునారాయణుని ధ్యానించవలయును. దుష్టచిత్తైః = చెడు మనసు=గల వారిచే, స్మృతః అపి = స్మరింపబడినను, హరిః పాపాని హరతి = భగవంతుడు పాపములను హరించును, అనిచ్ఛయా సంస్పృష్టః అపి = అనుకోకుండా తాకబడినను, పావకః దహతి ఏవహి = అగ్ని దహించుచున్నదిగదా, తత్ర అచ్చుతే కీర్తితే = భగవంతుడు కీర్తింప బడగా, అఘంప్రలయం యాతి = పాపము నశించును, తద్ కిం విచిత్రం=అదిఏమి చిత్రము, హరేః నామ ఏవ నామైవ=హరినామమే నామమే, మమజీవనమ్=నాకు బ్రతుకు తెరువు, అన్యధా=మఱియొక విధముగా, గతిః = ఉపాయము, కలౌ=కలియుగమందు, నాస్త్యేవ=లేదు, వాసుదేవం విష్ణుం = పరమాత్మయగు విష్ణువును, స్తుతా=స్తుతించి, నరః విపాపః జాయతే=నరుడు పాప వినిర్ముక్తుడు అగును. తపఃకర్మాత్మకాని = తపసు= కర్మ స్వరూపముగగలవి. యానిఅశేషాణి ప్రాయశ్చిత్తాని = ఏ సమస్తమైన ప్రాయశ్చిత్తములుకలవో, అశేషాణాం తేషాం=వానిలో అన్నింటిలో, కృష్ణానుస్మరణం పరం=శ్రీ కృష్ణ చింతనము ఉత్తమము, గోవిందః=గోవిందుడు భగవంతుడు, సకృత్ స్మృతఃఅపి = ఒకసారి స్మరింపబడినను, నృణాం జన్మశ##తైః కృతం = మనుష్యులు వందలకొలది జన్మలలో చేసిన, పాపరాశిం=పాపపురాశిని, అనలః తూలరాశిమివ = అగ్నిదూది ప్రోవునువలె, దహతి = దహించును, యే గోవిందం నమస్యన్తి = ఎవరు భగవంతుని నమస్కరింతురో, నతేషాం విద్య తేభయం=వారికి భయము ఎన్నడును లేదు, కృష్ణేకృతః ఏకః అపి ప్రణామః = కృష్ణునకు చేసిన నమస్కారము ఒక్కటి అయినను, దశాశ్వమేధావభృధేనతుల్యః = పది అశ్వ మేధయాగముల యొక్క అవభృధములతో సమానము, దశాశ్వమేధీపునః ఏతిజన్మ=పది అశ్వమేధములు చేసినవాడు తిరిగి జన్మఎత్తును, కృష్ణ ప్రణామీ న పునః భవాయ=కృష్ణునకు నమస్కరించినవాడు మఱల సంసార బంధములో చిక్కుకొనడు, కర్మ = స్వధర్మము, స్వనుష్ఠీయతాం = చక్కగా ఆచరింపబడుగాక, తేన ఈశస్య విధీయతాం అపచితిః = దానిచే భగవంతునికి పూజచేయబడుగాక, ఇతి స్వం స్వం కర్మ సమ్యక్ అనుతిష్ఠామః = మనము చేయవలసిన పనిని బాగుగా ఆచరింతము, స్వధర్మానుచరణమే భగవంతునికి పూజ, భగవదానాధనం భగవదనుగ్రహస్యద్వారం=భగవంతుని ఆరాధించుట భగవదనుగ్రహమును పొందుటకు సాధనము. కనుక మనము భగవంతుని అర్చించి నిశ్ర్శేయసమును సంపాదింతము.
పుట 69. పంచాత్మకే = ఐదు అయిన, పృధివీ ఆఫ్ తేజో నిలఖే సముత్థితే = పృథివి జలము తేజసు= వాయువు ఆకాశము ఐదు భూతములు సముత్థితములు కాగా, యోగగుణ = యోగముయొక్క గుణము, ప్రవృత్తే= సిద్ధింపగా, యోగాగ్ని మయం శరీరం ప్రాప్తస్యతస్య= యోగాగ్ని శరీరమును పొందిన అతనికి, నరోగః = రోగమురాదు. నజరా = ముసలితనము లేదు, నమృత్యుః = మరణములేదు.
పుట. 70. గ్రంథకోటిభిః యదుక్తః = కోట్లకొలది గ్రంథములచే ఏది చెప్పబడినదో దానిని, శ్లోకార్థేన ప్రవక్ష్యామి = అరశ్లోకముతో చెప్పుదును, బ్రహ్మసత్యం జగత్ మిధ్యా జీవః బ్రహ్మైవ న అపరః = బ్రహ్మపదార్థమొక్కటే సత్యమైనది. జగత్తు అనిర్వచనీయము. జీవుడు బ్రహ్మయే భిన్నడుకాడు.
పుట 72. తే=వారు (ఋషులు), ధ్యానయోగానుగతాః=ధ్యానయోగమును అనుసరించినవారై, స్వగుణౖర్ని గూఢాం = సత్వరజస్త మోగుణములచే దాగియున్న, త్వాం ఏవ దేవీం = జగజ్జననివగునిన్నే, అపశ్యన్ = సాక్షాత్కరించుకొనిరి, త్వమ్ ఏవ శక్తి పరమేశ్వరస్య = నీవే పరమేశ్వరశక్తిని, విశ్వేశ్వరిమోక్షదాత్రీ = జగన్నియామకురాలా! మోక్షము నిచ్చుదానా! మాం పాహి = నన్ను రక్షింపుము, శ్రుతివాక్యగీతా = వేదవాక్యములచే కీర్తింపబడిన, దేవాత్మశక్తిః = పరమేశ్వరశక్తి, మహరిలోకస్య పురః ప్రసన్నా = మహరుల ముందు సాక్షాత్కరించినది, గుహంపరంవ్యోమ = బుద్ధి గుహ పరమాకాశము, సతఃప్రతిష్ణా = సద్వస్తువునకు స్వమహిమ ప్రతిష్ఠానము.
శ్వేతాశ్వవాక్యోదితదేవి! దుర్గే శ్వేతాశ్వరోపనిషత్తు నందు వర్ణింపబడినదేవి! దుర్గా!, అస్య పరాశక్తి ః = పరమేశ్వరునియొక్క పరాశక్తిని, వివిధైవ = నానా విధములైన శక్తులు నీవిగా, శ్రూయతే = వినబడుచున్నవి, తే జ్ఞానబలక్రియా = నీకు జ్ఞాన ఐశ్వర్య, క్రియలు = స్వాభావిక = స్వభావసిద్ధములు, దేవాత్మశ##బ్దేన శివాత్మభూతా = దేవాత్మ శబ్దముచే శ్రుతియందు బోధింపబడిన శివస్వరూపురాలవు.
కూర్మవాయవ్య వచోనివృత్యా = కూర్మవాయువునకు జెందిన వాక్కును వివరించుటచేత, త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా = నీవు పాశములను ఛేదించు దానవుగా ప్రసిద్ధురాలవు, త్వం బ్రహ్మపుచ్ఛా వివిధామయోరీ = నీవు బ్రహ్మపుచ్ఛముగాగల పలురంగుల నెమిలివి, బ్రహ్మప్రతిష్ఠా అపి=నీవు సర్వాధారమైన బ్రహ్మవు, జ్ఞానస్వరూపాత్మాతయీ = జ్ఞానస్వరూపురాలవు అగుటచే, మాం పాహి = నన్ను రక్షింపుము.
పుట 73. భూతానీ దుర్గా = భూతములు దుర్గాదేవి, భువనాని దుర్గా = లోకములు దుర్గ. స్త్రియః = స్త్రీలు, నరాః = పురుషులు, పశుశ్చ = పశువులు, దుర్గా దుర్గయే, యత్ యత్ హి దృశ్యం = దృశ్యజగత్తు అంతయు, సైవదుర్గా ఆదుర్గయే, దుర్గాస్వరూపాత్ అపరం న కించిత్ = అంతయు, దుర్గా స్వరూపమే దుర్గకానిది ఏదియు లేదు.
పుట 80. తస్మిన్ సాంబే పరబ్రహ్మణి = ఆ అంబాసమేతుడైన పరబ్రహ్మశివునియందు, మేహృదయం = నాచిత్తము, సుఖేనరమతామ్ = హాయిగా క్రీడించుగాక.
పుట 81. ఆకాశః చికురాయతే యస్య=ఎవనికి ఆకసము ముంగురులు అగునో! దశదిశాభోగః = విస్తృతమైన దశదిశలు, దుకూలాయతే = తెల్లని పట్టు వస్త్రమగునో, శీతాంశుః ప్రసవాయతే = చంద్రుడు ఆభరణముతో, స్థిరతరానందః స్వరూపాయతే = నిత్యానందము స్వరూపమగునో, వేదాన్తః నిలయాయతే = ఉపనిషత్తులు నివాసమగునో, సువినయః స్వభావాయతే=చక్కని వినయము స్వభావము అగునో-ఆ సాంబపరబ్రహ్మమూర్తియందు నా హృదయము సుఖముగా లగ్నమగుగాక.
పుట 83. శ్రుతి స్మృతి పురానాణామ్ ఆలయం = వేదధర్మ శాస్త్ర పురాణములకు నివాసమయిన, కరుణాలయం = దయానిధియగు, లోకశంకరం = జనులకు సుఖకరుడైన భగవత్పాద శంకరం = శఙ్కర భగవత్పాదులను, నమామి = నమస్కరించుచున్నాను.
పుట 84. వేదః నిత్యం అధీయతామ్ = వేదము ప్రతిదినము అధ్యయనము చేయబడుగాక, తదుదితం కర్మ = వేదోక్త మగుపని, స్వనుష్ఠీయతామ్ = చక్కగా అనుష్ఠింపబడుగాక, తేన ఈశస్య అపచితిః విధీయతాం = దానిచే ఈశ్వరునకు పూజచేయబడుగాక, సద్విద్వాన్ = మంచి విద్వాంసుడు (గురువు), సమీపించబడుగాక, ప్రతిదినం తత్పాదుకే సేవ్యతాం = ప్రతిదినము గురుచరణములు సేవింపుము.
పుట 103. అదః = దూరముగా పరోక్షముగా ఉన్న పరబ్రహ్మ, పూర్ణమ్ = వ్యాపకము, (అంతట నిండియున్నది), ఇదం = ఈ దేహాద్యుపాధులలో నున్న ప్రత్యగాత్మరూపము, పూర్ణం = నిండియున్నది. పూర్ణాత్ = వ్యాపకనిరుపాధిక పరబ్రహ్మనుండి, పూర్ణం సోపాధిక = ప్రత్యగాత్మ స్వస్వరూపముచే అపరిచ్ఛిన్నమైనది. ఉదచ్యతే = ఉద్గతమగుచున్నది. పూర్ణస్య పూర్ణమాదాయ = బ్రహ్మయొక్క పూర్ణత్వమును తీసికొని, అవిద్యా ప్రతిభాతమగు అపూర్ణత్వమును త్రోసిపుచ్చి, పూర్ణమ్ ఏవ అవశిష్యతే = ప్రజ్ఞాన ఘనైకరసముగా మిగులుచున్నది.
పుట 103. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య' తిత్తిరిః ఐతరేయంచ, ఛాందోగ్యం, బృహదారణ్యకం దశ || ఈశోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు, అనునవి పది ఉపనిషత్తులు.
పుట 104. దారుకావికాకారేదంతిని = కఱ్ఱతో చేసిన ఏనుగుబొమ్మయందు, దారుతిరోభవతి = పిల్లలకు కొయ్యకనపడదు. సః అపితత్రైవ=పెద్దలకు ఏనుగు కనపడదు, తధాజగతి పరమాత్మా=తిరోధత్తే=అట్లే జగత్తునందు పరమాత్మా అజ్ఞానులకు కనబడదు, పరమాత్మని అపి జగత్ తిరోధత్తే = జ్ఞానులకు జగత్తు కనబడదు. పరమాత్మయే కనుపించును.
పుట 105. దేవీ! తన¸° = నీ ఏచరణములను, శ్రతీనాం మూర్థానః = శ్రుతి శిరసు=లు అనగా ఉపనిషత్తులు, శేఖరతయా దధతి = శిరో భూషణములుగా ధరించుచున్నవో, ఏతౌ చరణౌ = ఈ పాదములను మాతః = తల్లీ!, మమ అపి శిరసిదయ విధేహి = నాశిరసు= నందుకూడ ఉంచుము, పశుపతి జటాజూట తటినీ = శివునిజడలయందున్న గంగానది, యయోః పాద్యః పాధః = ఏ చరణములకు పాదోదకమో, అరుణ హరి చూడామణిరుచిః = విష్ణువుయొక్క ఎఱ్ఱని శిరోరత్నకాంతి, యయోః లాక్షాలక్ష్మీః = ఏ చరణములకు శోభయో.
పుట 106. అహం=నేను, సువేదన ఇతి నమన్యే = బాగుగా తెలిసికొంటిని అని తలంచుటలేదు, న వేద ఇతిచనో = తెలియదు అని అనుకొనుట లేదు, వేదచ = తెలుసును, యో నః తద్వేద తద్వేద = ఎవడు మా మాటలను తెలిసినవాడో వాడు బ్రహ్మను తెలిసినవాడు, నోనవేదేతి వేదచ = తెలియకపోవటలేదు, తెలుసును. నవేదచ = తెలియదు, అనగా బాగుగా తెలుసును అని చెప్పినచో బ్రహ్మఫలవ్యాప్యము అని అంగీకరించినట్లు అగును. అపుడు ఘటపటాది జడవస్తువులను పోలినది యగును. స్వప్రకాశము అగు బ్రహ్మను సూర్యుని దివిటీ ప్రకాశింపజేయబూనినట్లు ఫలము (చిదాభాసుని) చే ప్రకాశించినదనుకొనుట పొరబాటు.
పుట 107. అంగుష్ఠమాత్రః పురుషః అంతరాత్మ = అంగుష్ఠ పరిమాణముగల పురుషుడు అంతరాత్మ సదాజనానాం హృదయే సంనివిష్టః = జనులయొక్క హృదయమునందు ఎల్లప్పుడు ఉంటున్నాడు, తం స్యాత్ శరీరాత్ ధైర్యేణ ప్రవృహేత్ = ఆ ఆత్మను ధైర్యముతో శరీరమునుండి వేరుపరచి, తెలిసికొనవలయును. ముంజాత్ ఇషీ కామ్ ఇవ ధాన్యము కంకినుండి, ధ్యానమునువలె.
పుట 109. ఏవం తం విద్వాన్= ఈ విధముగా ఆ పరమాత్మను తెలిసినవాడు, ఇహ అమృతః భవతి = ఈ జన్మలోనే అమృతత్వమును పొందుతాడు, అయనాయ మోక్షమునకు, అన్యః పంథాః = వేరు మార్గము, నవిద్యతే లేదు.
పుట 111. గౌణమిధ్యాత్మనో7సత్వే=మన శరీరముకంటే బాహ్యముగా ఉండు పుత్రమిత్రాదులు గౌణాత్మ, దేహేంద్రియాంతః కరణాదులు=మిథ్యాత్మ, పుత్ర మిత్రాదులందు దేహాదులందు ఆత్మభావముచే మనము బంధమునకు గుఱియగుచున్నాము. సద్ బ్రహ్మ ఆత్మా అహమ్ ఇత్యేవంబోధే = నేను సత్యమైన బ్రహ్మస్వరూపుడనే అను జ్ఞానము కలిగినపుడు ఆ బంధము వినిర్ముక్తమగును. అపుడు, కార్యం కథంభ##వేత్ = కర్తవ్యమెట్లు ఉండును? జ్ఞానముచే అజ్ఞానము నివృత్తముకాగా అజ్ఞాన కార్య సంసారమును అనుభవింపడు. అహంకారమే నివృత్తము కాగా కర్తవ్యము మిగులదు. నేను ఇది చేయవలయును అను భావముతో సాధనా భ్యాసకునివలె ఉండదు.
పుట 112. అయం ఆత్మా ప్రవచనేన నలభ్యః = ఈ ఆత్మ స్వాథ్యాయమును ఇతరులకు చెప్పుటచేత సాక్షాత్కరింపదు, న మేధయా = బహుగ్రంథ ధారణ సామర్థ్యము చేత పొందలేము, న బహుశ్రేతన = అనేక పర్యాయము శ్రుతియను శ్రవణము చేయుటచేత పొందలేము. యం ఏషః వృణుతే = ఏ ఆత్మను సాధకుడు ప్రార్థించుచున్నాడో, తేనలభ్యః = ఆ ఆత్మచేతనే తెలియబడు చున్నాడు, ఏషాత్మాస్వాం తమాం తస్య వివృణుతే = అతనికి ఈ ఆత్మ తన స్వరూపమును వివరించుచున్నది. ఆత్మానం రధినం విద్ధి = ఆత్మను రధికునిగా తెలిసికొనుము, శరీరం రధమేవతు = శరీరమున రధమునుగా తెలియుము, బుద్ధింతు సారధింవిద్ధి=బుద్ధిని సారధిగా తెలిసికొనుము, మనః ప్రగ్రహమేవచ= మనసు=ను పగ్గముగా తెలియము.
పుట 113. ఇంద్రియాణి హయాన్ ఆహుః=ఇంద్రియములను గుఱ్ఱములుగా చెప్పుచున్నారు. విషయాన్ తేషుగోచరాన్=శబ్దస్పర్శాది విషయములు మార్గములు, ఆత్మేంద్రియమనో యుక్తం భోక్తా ఇత్యాహుర్మనీషిణః=శరీరము ఇంద్రియములు మనసు=లతో తాదాత్మ్యము చెందియున్న ఆత్మ భోక్త అని విద్వాంసులు పలుకుదురు.
పుట 113. మధ్యే ఆత్మని = శరీరమధ్యయందు, అంగుష్ఠ మాత్రం పురుషః = బొటనవ్రేలియంత పరిమాణము గల పురుషుడు (ఆత్మ), తిష్ఠతి = ఉన్నాడు, ఈశానోభూత భవ్యస్య = జరిగినదానికి, జరుగబోయేదానికి ఈ పురుషుడు అధిపతి, న తతో విజుగుప్యత్ = తెలిసినవాడు దానిని గర్హింపడు, ఏతద్వైతత్ = ఇదే ఆ ఆత్మ.
పుట 113. తత్ర= ఆ పరమాత్మయందు, సూర్యః న భాతి = సూర్యుడు ప్రకాశింపడు. అనగా సూర్యుడు ఆ పరమాత్మను ప్రకాశింపచేయలేడు, న చంద్రతారకం= చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపజేయలేవు. న ఇమా విద్యుతః భాన్తి = ఈ మెఱుపులు ప్రకాశింపజేయలేవు. అయమగ్నిః కుతః = ఈ అగ్ని ఎట్లు ప్రకాశింపజేయగలుగును?, తం ఏవ భాన్త = ఆ చిద్రూపపరమాత్మ స్వయముగా ప్రకాశించుచుండగనే, సర్వం అనుభాతి = అంతయు దానిని అనుసరించి ప్రకాశించు చున్నది. తస్య భాసా సర్వం ఇదం విభాతి = ఆ పరమాత్మ ప్రకాశముచేతనే ఈ జగత్తు అంతయు ప్రకాశించు చున్నది.
పుట 114. ఊర్థమూలః = పైకి వ్రేళ్ళుకలది, అవాక్‌శాఖః = క్రిందికి కొమ్ములుకలది. ఏషః అశ్వత్ధః సనాతనః = ఇది పురాతన (రావి) వృక్షము, తద్ ఏవశుక్రం = అదే శుద్ధము, తద్ బ్రహ్మ = అది బ్రహ్మ, తదేవ అమృతం ఉచ్యతే= అదే అమృతము అని పిలువబడుచున్నది. తస్మిన్= ఆ బ్రహ్మయందే, సర్వలోకాః=లోకములన్నియు శ్రితాః= ఆశ్రయించుకొనియున్నవి.
తదు నాత్యేతికశ్చన = ఎవడును దానిని అతిక్రమింప జాలడు, ఏతద్ వైతద్ ఇదియే ఆ ఆత్మ.
పుట 114. యదా=ఎప్పుడైతే, అస్య=ఈ సాధకునియొక్క, హృదిశ్రితాః= హృదయము (అంతఃకరణము)ను ఆశ్రయించిన, సర్వేకామాః=కోరికలన్నియు, వ్రముచ్యన్తే= నశించుచున్నవో, అథమర్త్యః అమృతః భవతి = అనంతరము (అపుడు) మర్త్యః అమృతః భవతి = మానవుడు అమృత స్వరూపుడు అగుచున్నాడు, అత్ర బ్రహ్మ సమశ్నుతే = ఇచ్చటనే బ్రహ్మత్వమును పొందును.
పుట 115. ప్రణవః ధనుః = ఓంకారము ధనుసు=, శరః హి ఆత్మా = ఆత్మ బాణము, తద్ బ్రహ్మ లక్ష్యం ఉచ్యతే =ఆ బ్రహ్మలక్ష్యము. అప్రమత్తేన వేద్ధవ్యం = ఏమరుపాటులేకుండా కొట్టవలయును, శరవత్ = బాణమువలె, తన్మయః భ##వేత్ = లక్ష్యములో చేరిన వాడు అగును.
పుట 116. ద్వా సుపర్ణా సయుజా సఖాయా = రెండు మంచి ఱక్కలుగల పక్షులు కలిసి స్నేహముగా ఉండునవి. సమానం వృక్షం పరిషస్వజాతే = ఒకే వృక్షమును ఆశ్రయించి ఉన్నవి, జీవాత్మ పరమాత్మలు ఒకే శరీరమందు ఉన్నారు, తయో రన్యః పిప్పలం స్వాదు అత్తి = వీరిలో ఒకడు కర్మ ఫలమును రుచితో భుజించును, అనశ్నన్ = తినకయే, అన్యః = మఱియొకడు పరమాత్మ, అభిచాకశీతి = ప్రకాశించును.
పుట 117. సత్యమ్ ఏవజయతే = సత్యమే జయించును, న అనృతం = అసత్యము ఎన్నడును జయించజాలదు, వితతః = విస్తారమయిన, దేవయానః పంథాః = దేవయాన మార్గము, సత్యేన = సత్యముచే లభ్యము.
పుట 117. వేదాన్త విజ్ఞాన సునిశ్చితార్థాః = వేదాన్త విజ్ఞానముచే ఆత్మను నిశ్చయముగా తెలిసికొనినవారు, సంస్యాసయోగాద్యతయః శుద్ధసత్త్వాః = సర్వకర్మ సంసన్యాసముచేత విశుద్ధమైన జ్ఞానం కలవారు యతులు, పరాంతకాలే = దేహమును విడిచే కాలమున, పరామృతాః = దేహము నేను అను భావన వీడుటచే అశరీర బ్రహ్మభావమునొంది, బ్రహ్మలోకేషు = బ్రహ్మయనులోకములందు, పరిముచ్యన్తి పూర్తిగా విముక్తులగుదురు.
పుట 117. యధా సద్యః స్యందమానా = ఏ విధముగా నదులు ప్రవహించుచు, నామరూపే విహాయ = నామరూపములను విడనాడి, సముద్రే అస్తంగచ్ఛన్తి = సముద్రంలో ఏకమగునో, తథా విద్వాన్ నామరూపాద్విముక్థః = అట్లే జ్ఞాని నామరూపముల విడనాడినవాడై, పరాత్పరం దివ్యం పురుషం ఉపైతి = పరాత్పరుడు అందఱి కంటే శ్రేష్ఠుడు అగు దివ్య పురుషుని పరమాత్మను పొందుచున్నాడు.
పుట 120. సత్యంవద నిజమును పలుకుము, ధర్మంచర = ధర్మమును ఆచరింపుము, స్వాధ్యాయాత్ మా ప్రమదః = వేదాభ్యాసమును ఏమఱవకుము, ఆచార్యాయప్రియంధనం ఆహృత్య = గురువులకు ఇష్టమగు ధనమును దక్షిణను, తెచ్చియిచ్చి, ప్రజాతంతుం మావ్యవతీ=ః = సంతతి ఎడతెగకుండా పుత్రపౌత్రపరంపరగా వర్ధిల్లునట్లు చూడుము, సత్యాత్ న ప్రమదితవ్యం = సత్యమును ఏమఱవకుము, ధర్మాత్ న ప్రమదితవ్యం ధర్మమును ఏమఱవకుము, కుశలాత్ న ప్రమదితవ్యమ్ = తనను రక్షించుకొను పనినుండి ఏమఱవరాదు. భూత్యైన ప్రమదితవ్యమ్=ఐశ్వర్యము (అభ్యుదయము) కొఱకు ఏమఱవకుము, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం=అధ్యయన అధ్యాపనములు అవశ్యము చేయవలయును. దేవపితృ కార్యాభ్యాం న ప్రమదితవ్యమ్ = దేవకార్యములను పితృకార్యములను చేయవలయును, మాతృదేవోభవ = తల్లిని దేవతగా పూజింపుము, పితృదేవోభవ = తండ్రిని దేవునిగా పూజింపుము, ఆచార్యదేవోభవ = గురువును దేవునిగా పూజింపుము, అతిధిదేవోభవ = అతిధిని దేవునిగా పూజింపుము, యాని అనవద్యాని కర్మాణితానిసేవితవ్యాని = దోషములేని పనులనే చేయుము, నో ఇతరాణి = దోషముతో కూడిన పనులన చేయవలదు, యాని అస్మాకం సుచరితాం తాని త్వయా ఉపాస్యాని = మేము చేయుమంచి పనులనే నీవు చేయుము, నో ఇతరాణి = ఒకవేళ మేము చెడ్డపనులను చేసి యున్నచో వానిని నీవు చేయవలదు, ఏకేచఅస్మద్ శ్రేయాంసః బ్రాహ్మణః = మన శ్రేయసు=కోరు ఉత్తములగు బ్రాహ్మణులు ఎవరు కలరో, తేషాం త్వయా అసనేన ప్రశ్వసితవ్యమ్ = వారికి నీవు ఆసనమిచ్చి శ్రమను పోగొట్టుటకు ప్రయత్నింపుము. లేదా వారి ఆసనమునందునీ ప్రశ్వాసముకూడా సోకకుండునట్లువినయముగా ప్రవర్తింపుము, శ్రద్ధయాదేయం = ఆస్తిక్యబుద్ధితో దానము చేయకుము, శ్రియాదేయం = విభవానుసారము దానము చేయుము, భియాదేయం= భయముతో ఇమ్ము, సంవిదాదేయం = విచక్షణజ్ఞానముతో దానము చేయుము, అథయదితే కర్మ విచికి=తా= = నీకు పనిచేయుటలో సంశయము కలిగినచో, వృత్త విచికితా=వాస్యాత్ = సదాచారమునందు సంశయము కలిగినచో, యే తత్ర బ్రాహ్మణాః సంమర్శినః = ఆ విషయమున విమర్శన శీలురగు బ్రాహ్మణులు, యుక్తాః = ప్రామాణికులు, ఆయుక్తాః = స్వతంత్రులు, అలూక్షాః = క్రూరముకాని బుద్ధికలవారు, ధర్మకామాః స్యుః = ధర్మదృష్టి కలవారు, యధా తత్రవర్తేరన్ = ఆ విషయమున ఎట్లు నడచుకొందురో, తథా తత్రవర్తేథాః = నీవు అట్లు ప్రవర్తింపుము, అథ అభ్యాభ్యాతేషు = ఇక సంశయగ్రస్త నిందితుల విషయమై కూడా వెనుక చెప్పిన ధర్మదృష్టిగల బ్రాహ్మణులు ఎట్లు వర్తింతురో నీవును అట్లే నడచుకొనుము, ఏష ఆదేశః = ఇది వేదము యొక్క ఆజ్ఞ. విధి, ఏష ఉపదేశః = ఇది ఉపదేశము, ఏషావేదో పనిషద్ = ఇది వేదరహస్యము, ఏతద్ అను శాసనమ్ = ఇది ఈశ్వరశాసనము, ఏవమ్‌ఉపాసితవ్యమ్ = ఇట్లు ఉపాసింప వలయును.
పుట 123. యతోవాచః నివర్తంతే = ఏ బ్రహ్మనుండి వాక్కులు మఱలునో, అప్రాప్య మనసాసహ = మనసు=నకు కూడా ఏబ్రహ్మ గోచరముకాదో బ్రహ్మ అవాజ్మానస గోచరము అనుట. బ్రహ్మణః ఆనందం విద్వాన్ = ఆ బ్రహ్మయొక్క ఆనంద స్వరూపమును తెలిసికొనిన వాడు, కదాచన న బి భేతి = ఎప్పుడును భయపడడు.
పుట 123. భృగుః వైవారుణిః = వరుణుని కొడుకుభృగువు ప్రసిద్ధుడు, వరుణం పితరం ముపసార అధీహి భగవో బ్రహ్మేతి = ఆ భృగువు బ్రహ్మ వస్తువును గూర్చి బోధింపవలసినదిగా వరుణుని సమీపించి ప్రార్థించెను, తసై#్మఏతత్ ప్రోవాచతసై#్మ = ఆ భృగువునకు, ఏతత్ ప్రోవాచ అన్నము ప్రాణం చక్షుః శ్రోతం మనోవాచమితి = వరుణుడు అన్నము ప్రాణము చక్షువుశ్రోత్రము మనసు= వాక్కు = చరా బ్రహ్మను తెలిసికొనుము అని చెప్పెను. తః హ ఉవాచ యతోవా ఇమాని భూతాని జాయన్తే = దేనినుండి సమస్త చరాచర భూతములు పుట్టుచున్నవో, యేనజాతాని జీవంతి = పుట్టినవి దేనిచేత జీవించు (స్థితి) చున్నవో, యత్ ప్రయాన్తి అభిసంవశంతి ఇతి = నశించునపుడు దేనిని చేరుచున్నవో, తిద్ బ్రహ్మ=అది బ్రహ్మ అని లక్షణముచెప్పి, తద్ విజిజ్ఞాసస్వ = దానిని నీవే క్రమముగా తెలిసికొనుము అని భృగువుతో చెప్పెను, సతసః అతప్యత = అపుడు భృగువు తపసు= చేసెను, ఆలోచించెను, సతపః తప్త్యా = అతడు బాగుగా ఆలోచించి.
పుట 125. అన్నం న నింద్యాత్ = అన్నమును నిందింపరాదు, తదవ్రతం = అదివ్రతముగా పాటింపవలయును, ప్రాణో వా అన్నం = ప్రాణమే అన్నము, శరీరం అన్నాదం = శరీరము అన్నముతినునది, ప్రాణశరీరం ప్రతిష్టితం = శరీరము ప్రాణమునందు ప్రతిష్ఠితమైనది, శరీరేప్రాణః ప్రతిష్ఠితః = శరీరమునందు ప్రాణము ప్రతిష్ఠితమైనది, ఆధారపడినది, తదేతదస్న మన్నే ప్రతిష్ఠితం = కనుక శరీరప్రాణములు ఒకదానికొకటి అన్న మగుటచే అన్నము అన్నమునందు ప్రతిష్ఠితమైనది, తదేత దన్నమన్నే ప్రతిష్ఠితంవేద = ఎవడు ఈ విషయమును తెలిసికొనునో, ప్రతితిష్ఠతి అన్నవాన్ అన్నాదో భవతి = ప్రతిష్ఠ అన్నము కలవాడు అగుచున్నాడు, మహాన్ భవతి ప్రజయా పశుభిః బ్రహ్మవచ్చసేన = పశుసంపద సత=ంతానము బ్రహ్మవర్చసు కీర్తి మొదలగు వానిచే గొప్పవాడు అగుచున్నాడు.
పుట 126. అహమన్నన్ = నేను అన్నము, అహం అన్నాదః = నేను అన్నభోక్తను, అహం శ్లోకకృత్ = నేను అన్నఅన్నాద సంఘాతమునకు కర్తను, అహమస్మి ప్రథమ జాఋత2స్య = మూర్తామూర్త జగత్తునకు ముందునేను పుట్టినవాడును, పూర్వం దేవేభ్యః = దేవతలకు పూర్వముఉంటిని. అమృతస్య నాభిః = అమృతమునకు మధ్యస్థానము, అహమస్మి = నేను అగుచున్నాను, యః మాదదాతి = ఎవడు అన్నరూపమగునన్ను ఇచ్చునో, స ఇత్ ఏవం ఆవాః = వాడు ఈ విధముగా నన్ను రక్షించుచున్నాడు, అహమన్న మన్న మదన్తమద్మి = ఎవడుఇతరులకు అన్నమును పెట్టక తానే తినునో నేను వానిని భక్షింతును, అహం విశ్వంభువనం అభ్యభవాం = నేను సమస్తమైన లోకమును ఈశ్వరస్వరూపముతో అతిక్రిమించియుంటిని, సువః న జ్యోతిః = నా ప్రకాశము సూర్యునివలె వెలుగును, యః ఏవం వేద = ఎవడు ఇట్లు తెలిసికొనునో వాడు ముక్తి పొందును.
పుట 129. ఆహారశుద్ధౌ సత్వ శుద్ధిః = మంచి ఆహారమువలన అంతఃకరణము నిర్మలముగా ఉండును, సత్వశద్ధౌ ధృవాస్మృతిః = అంతఃకరణము శుద్ధము కాగా స్థిరమైన జ్ఞానము, స్మృతిలంభే = పరిపక్వజ్ఞానము లభింపగా, సర్వగ్రంధీ విమోక్షః = అవిద్యా కామాది గ్రంధులు విడిపోవును, తసై#్మమృదిత కషాయాయ=రాగాది వాసనలుసడలిన ఆ నారదునికొఱకు, తమసః పారందర్శయతి = సనత్కుమారులు ఆత్మజ్ఞానోపదేశము చేత అజ్ఞానమునకు అవతలగట్టును చూపుచున్నారు.
పుట 131. మా =నన్ను, అసతః =స్వభావిక రాగద్వేష పురస=రప్రవృత్తినుండి, అసతః మాసద్ గమయ =అసత్యమునుండి నన్ను సద్వస్తువును పొందునట్లు చేయుము. (శాస్త్రీయ కర్మజ్ఞాపయే), తమసం మా జ్యోతిః గమయ =నన్ను చీకటిలోనుండి (తత్వజ్ఞానము) వెలుగులోనికి తీసికొనివెళ్ళుము. మృత్యోః మా అమృతం గమయ = మృత్యువునుండి నన్ను అమృతత్వమును (ఆనందస్వరూపమును) పొందింపుము.
పుట 132. నవైఅరే పత్యుః కామాయ పతిః ప్రియః భవతి=భార్యకు భర్త, భర్త ప్రయోజనముకొరకు ఇష్టుడుకాడు, ఆత్మనః తు కామాయ పతిః ప్రియః భవతి = తన ప్రయోజనము కోరకే భర్త ఇష్టుడు అగును, న వై అరే జాయాయై కామాయ జాయాప్రియా భవతి = అట్లే భర్తకు భార్య, భార్యయొక్క ప్రయోజనము కొఱకు ఇష్టురాలుకాదు, ఆత్మ నస్తు కామాయ జాయా ప్రియా భవతి = తన ప్రయోజనము కొఱకే భార్య ఇష్టురాలు అగుచున్నది. ఇట్లే, పుత్ర, విత్త, పశు, బ్రహ్మ, క్షత్ర, లోక, దేవ, వేద, భూత, సర్వ వాక్యములు అర్థములు బోధించును. కామాయ = ప్రయోజానాయ, ఆత్మప్రీతికీ సాధనములుగా ఉన్నంత వరకే జాయాపుత్ర విత్తాదులు ప్రియములు. ఆత్మయందు ప్రీతి నిరువాధికము. ఆనందస్వరూపము ఆత్మ కనుక, ఆత్మయందు అందఱికి ప్రీతి ఉంటున్నది. ఆత్మా వై అరే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః = మైత్రేయి! ఆత్మని ఖలు అరే దృష్టే. శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితమ్=మైత్రేయీనిశ్చయముగా ఆత్మవస్తువును సాక్షాత్కరింపజేసి కొనుము. అందుకు సాధనములు, శ్రోతవ్యః మంతవ్యః నిదిధ్యాసితవ్యః = శ్రవణము మననము, నిదిధ్యాసనము అయియున్నవి, ఆచార్య ముఖమున వేదాన్తవాక్యలము సాహాయ్యముచే ఆత్మతత్త్వమును తెలిసికొని యుక్తులతో చింతనము చేసి ఏకాగ్రధ్యానము చేసినయెడల సర్వము తెలియబడినది అగును.
పుట 134. యత్రహి ద్వైత మివభవతి తద్ ఇతర ఇతరం పశ్యతి = అవిద్యాదశలో మిథ్యాభూతమైన భేదభావము ఉండును కనుక. అపుడు దేవదత్తుడు యజ్ఞదత్తుని చూచుచున్నాడు అన్నట్లు వ్యవహార ముండును. తద్ ఇతరః ఇతరం జిఘ్రతి = అపుడు గంధమును ఘ్రాణముతో గ్రహించుచున్నాడు, ఇతరః ఇతర రసయతో= రసమును జిహ్వతో ఆస్వాదించుచున్నాడు. ఇతర ఇతర మభివదతి = మాట్లాడుచున్నాడు, ఇతరం శృణోతి = వినుచున్నాడు, మనుతే = ఆలోచించుచున్నాడు. స్పృశతి = తాకుచున్నాడు, విజానాతి = తెలిసికొనుచున్నాడు, అను వ్యవహారమున కర్మకంటే కర్త వేరుగా క్రియాకారక ఫలములు తెలియబడునున్నవి, యత్ర తు అస్య సర్వం ఆత్మైవ అభూత్ = ఎప్పుడైతే అనగా విద్యాదశయందు సర్వము ఆత్మగా అనుభూతి కలుగునో, తత్ కేనం కం పశ్యేత్ = అపుడు దేనితో దేనిని చూచును? చూచువాడు చూడబడునది చూచుట అను క్రియలేవు. కేన కం జి ఘ్రేత్ = దేనితో దేనిని మూర్కొనును? కేన కం అభివదేత్ = దేనితో దేనిని పలుకును? కేన కం శృణుయాత్ = దేనితో దేనిని వినును? కేన కం మన్వత = దేనితో దేనిని ఆలోచించును? కేన కం స్పృశేత్ దేనితో దేనిని తాకును? కేన కం విజానీయాత్ = దేనితోదేనిని తెలిసికొనును? కర్తృ కర్మ క్రియాకరణ వ్యవహారము అవిద్యావస్థలోనిది, యేన ఇదం సర్వం విజానాతి తం కేన విజానీయాత్=ఏ ఆత్మచే అంతయు తెలిసికొనుచున్నాడో ఆ ఆత్మను దేనితో తెలిసికొనెదవు? ఆక్షేపము - దేనితోను దెలిసికొనలేవు, ఆత్మ స్వయంప్రకాశము అని గ్రహింపవలయును, విజ్ఞాతార మరే కేన విజానీయాత్ = తెలిసికొనువానిని దేనితో తెలిసికొందువు? ఆత్మను తెలిసి కొనుటకు మఱియొక ఆత్మలేదు అని భావము. ఆత్మ ఒక్కటే. అది స్వప్రకాశము.
పుట 136. సలిలః ఏకః ద్రష్టా అద్వైతః భవతి = అవిద్య నశించినపుడు జలమువలె స్వచ్ఛముగా జీవాత్మఉండును, ద్రష్ట = చూచువాడు అగు జీవుడు ద్వైతభావమును వీడి స్వయం జ్యోతిః స్వభావుడగు బ్రహ్మ (పరమాత్మ) తో ఏకమగుచున్నాడు, ఇతిహ ఏనం అనుశశా యాజ్ఞవల్క్యః = అని యాజ్ఞవల్క్యుడు జనకచక్రవర్తికి ఉపదేశించెను. ఏషా అస్య పరమాగతిః = ఇదియే జీవునకు ఉత్తమగతి, ఏషా అస్యపరమాసంపత్ = ఇదియే పరమ సంపత్తి, ఏషః అస్య పరమఃలోకః = ఇదియే ఉత్తమలోము, ఏషః అస్య పరమానందః = ఇదియే పరమానందము. ఏతస్య ఏవ ఆనందస్య అన్యాని భూతాని మాత్రా ముపజీవన్తి = ఈ ఆత్మ స్వరూపానంద లేశమును ఆధారంగా చేసికొని అన్ని ప్రాణులు జీవించుచున్నవి.
పుట 137. తదేషశ్లోః భవతి = ఆ విషయమున ఈ మంత్రము ప్రవృత్తమైనది, తద్ ఏవ సక్తః సహకర్మణా ఏతి, లిఙ్గం మనో యత్ర నిషక్తమస్య = జీవునియొక్క, లిఞ్గశరీరమున ప్రధానమగు మనసు= ఏఫలమునందు ఆసక్తి కలది యగునో, ఆ ఫలమునే తతా=ధన కర్మచే జీవుడు పొందుచున్నాడు. ప్రాప్య అంతం కర్మణః తస్య యత్కించ కరోతి అయం తస్మాత్ లోకాత్ పునరేతి అసై#్మలోకాయకర్మణ = అకర్మఫలము పూర్తి అయిన తరువాత జీవుడు తిరిగి ఆ ఫలమును పొందుటకై ఈ లోకమునకు కర్మచేయుటకు వచ్చుచున్నాడు. ఇతి ను కామయమానః=ఈ విధమైన కోరికలు కలవాడై సంసార దుఃఖమును అనుభవించుచున్నాడు, అథ అకామయమానః = కోరనివాడు, అకామః నెరవేరినవాడు ఆత్మయే కావలయు నని వేరు కామములు లేనివాడు ఎవడు కలడో, న తస్య ప్రాణాః ఉత్ర్కామంతి = అతని ప్రాణములు ఉత్ర్కామణముచేయవు. బ్రహ్మైవ సన్ బ్రహ్మ అప్యేతి ఇది = వఱకే బ్రహ్మస్వరూపుడై యుండియు అవిద్యావ్యవధానము ఇపుడు నివృత్తము కాగా బ్రహ్మను పొందుచున్నాడు.
పుట 139. తదేతద్ ఏవ ఏషా దైవీవాగనువదతి సనయిత్నుః దదద ఇతి ఇతి దామ్యత దత్త దయధ్వ మితి తదేత్త్రయం శిక్షేత్ దమం దానం దయా మితి స్తనయిత్నుః = మేఘము ఈ దైవీవాక్కునే దదద అని ఘోషిస్తున్నది. ద = దామ్యత, ద = దత్త, ద= ద దయధ్వమ్ = దేవతలకు మొదటి దకారము చే దమమును, మనుష్యులకు రెండవ దకారముచే దానమును, అసురులకు మూడవ దకారముచే దయను ఉపదేశించుచున్నది.
పుట 139. మైత్రీం భజత్ అశిలహృజ్జేత్రం = అందఱి హృదయములను ఆవర్జనచేయగల సుహృద్భావమును అలవరచుకొనుడు, ఆత్మవదేవ పరాన్ అపి పశ్యేత = తనను వలెనే ఇతరులనుకూడా చూడవలయును, యుద్ధం త్యజత = యుద్ధమును మానుడు. స్వర్థాం త్యజత = వైరమును వదలిపెట్టుడు, పరేషు = ఇతరులయందలి, అక్రమం ఆక్రమణం త్యజత = అక్రమమైన ఆక్రమణమును వదలిపెట్టుడు.
జననీ పృథివీ కామదుఘా ఆస్తే=తల్లియగు భూమి కోరినవస్తువులను ధేనువు క్షీరమునువోలే సమృద్ధిగా ఇచ్చుచున్నది. జనకః దేవః సకల దయాళుః = తండ్రియగు భగవంతుడు సర్వభూతములందుదయగలవాడు. జనతాః = ఓజనులారా ! దామ్యత దత్త దయధ్వమ్ = భోగములను అనుభవించుటలో సంయమము, దానము, దయకలవారు కండు, శ్రేయో భూయాత్ సకలజనాన్ = సమస్త జనులకు శ్రేయము కలుగుగాక.
పుట139. ఏతద్ వై పరమం తపః యద్ వ్యాధిత తప్యతే పరమం హైవ లోక జయంతి = వ్యాధిగ్రస్తుడు జ్వరము వచ్చినపుడు తపనచెందుట కూడా ఇది ఒక పెద్ద తపసు=గా భావింపవలయును, అట్లు చేయుటవలన ఉత్తమలోకములను పొందుచున్నాడు. య ఏవం వేద = ఎవడు ఇట్లు తెలిసికొనునో, ఏతద్వై పరమం తపః యం ప్రేతం అరణ్యం హరంతి పరమం హ లోకం జయతి = తాను గతించిన పిదప ఆ శరీరమును అరణ్యమునకు తీసికొని పోవుదురు అని తెలిసికొని నిశ్చింతగా ఉండుట పరమ తపసు=. దానివలన ఉత్తమలోకములు వచ్చును య ఏవం వేద ఏతద్వై పరమం తపః యం ప్రేత మగ్నే అభ్యాదధతి పరమం హవై లోకాజయతి = ప్రేతను అగ్నిలో దహన సంస్కారము చేయుదురు అని గ్రహించి మరణమును గుఱించి వ్యధ జెందక యుండుటగూడ తపసు=. ఈ విధముగా తెలిసికొనిన వాడు ఉత్తమ లోకము పొందును.
పుట 141. వివిధేన వహ్నినా ఇంధన సంభృతేన = నాలుగు దిశలందు సమిధలచే అగు అగ్నులచే, నభశ్చరేణ = పైన అకసమందు సంచరించు సూర్యుడే, పంచాగ్నుల మధ్య నికామతప్తా = మిక్కిలి తపము చేసిన, సా = ఆ పార్వతి తపాత్యయే = గ్రీష్మార్తమున, నవైః వారభిః ఉక్షితా = తొలకరివాన చినుకులచే తడుపబడినదై, భువా సహ భూమితోకూడా, ఊర్ధ్వగం ఊష్మాణం అముచత్ = పైకి వెడలు ఆవిరిని వదలిపెట్టెను.
శిలాశయీం=ఱాతి మీద పరుండునట్టి, ఆనికేతవాసనీంతాం=గృహములేకయే నివసించుచున్న ఆ పార్వతిని, నిరంతరాసు అంతరవాతవృష్టిషు = ఎడతెగని మధ్య మధ్య వాయువులతో కూడిన వరములందు, మహాతపః సాక్ష్యేస్థితా ఇవ = మహాతపసు=నకు సాక్ష్యముగా ఉన్నవి వలెనున్న, క్షపాః = రాత్రులు, తటిన్మయైః ఉన్మిషితైః = మెఱుపుచూపులతో, వ్యలోకయన్ = చూచినవి, ఏమాదిభిః వ్రతైః = ఈ మొదలగు వ్రతములలో, మృణాళికాపేలవం = తామరయాకువలె సుకుమారమైన, స్వం అంగం = తన శరీరమును, అహర్నిశం = ఱయింబవళ్ళు, గ్లపయన్తీ = వాడునట్లు చేయుచు, సా = ఆమె, శరీరైః = శరీరములచేతను, కరుణౖః =ఇంద్రియములచేతను, ఉపార్జితం = సంపాదింపబడిన, తపస్వినాం తపః=మునుల యొక్క తపసు=ను, దూరం అధశ్చకార=మిక్కిలి క్రిందుచేసెను.
పుట 145. హతో వా = చంపబడిన, స్వర్గంప్రాప్యసి = స్వర్గమును పొం దగలవు, జిత్వా వా = గెలిచియో. మహీం భోక్ష్యసే = భూమిని (రాజ్యము) అనుభవింప గలవు.
పుట 171 నానాఛిద్రఘటో దరస్థిత = పలురంధ్రములుగల కుండ మధ్యయందున్న, మహాదీప ప్రభాభాస్వరం = పెద్దదీపపు కాంతి ప్రకాశించు, యస్య తు జ్ఞానం = ఎవని యొక్క జ్ఞానము, చక్షురాది కరణద్వారా = కన్నుమొదలగు ఇంద్రియములద్వారా, బహిః స్పందతే = బయటకు ప్రసరించు చున్నదో, జానామి ఇతిభాన్తం తం ఏవ = పరిపూర్ణ జ్ఞానస్వరూపములో ప్రకాశించుచున్న ఆ ఆత్మను అనుసరించియే, ఏతత్ సమస్తం జగత్ అనుభాతి = ఈ సమస్త ప్రపంచము ప్రకాశించుచున్నది. తసై#్మ శ్రీ గురుమూర్తియే శ్రీ దక్షిణామూర్తయే ఇదం నమః=ఆ శ్రీ గురుమూర్తి యగు శ్రీ దక్షిణామూర్తిగల పరమేశ్వరునకు ఈ నమస్కారము, జ్ఞానానందమయం=జ్ఞానము ఆనందము స్వరూపముగాగల, నిర్మల స్ఫటికాకృతిం=శుద్ధ స్ఫటికమువంటి ఆకారముగల, సర్వవిద్యానాం ఆధారం అన్ని విద్యలకు ఆధారుడైన, హయగ్రీవం దేవం= భగవంతునిహయగ్రీవుని, ఉపాస్మహే = ఉపాసింతుము,
పుట 174. భస్మోద్ధూళన ! = శరీరమునకు పూనుకొను విభూతీ ! భవతే = నీకు, భద్రమస్తు = మంగళమగుగాక, శుభే రుద్రాక్షమాలే! = మంగళ స్వరూపురాలైన ఓ రుద్రాక్షమాలా ! నీకు మంగళమగుగాక, గిరిసుతా కాంతా = అ యాలంకృతే హా సోపానపరంపరే = విశాలాక్షి (అన్నపూర్ణా) దేవి ఆలయమందు అలంకరింపబడిన ఓ మెట్ల వరుసా! అయ్యో! మనము విడిపోవుచున్నాము. నీకు క్షేమము అగుగాక, అద్య = నేడు, ఆరాధనతోషి తేన విభునా = పూజ, జపము, ధ్యానము మొదలగు పరమేశ్వరసేవకు సంతుష్టుడైన ప్రభువుచే, యుష్మత=పర్యాసుఖా లోకోచ్ఛేదిని = మిమ్ములను సేవించి సుఖానుభూతిని పోగొట్టునట్టి, మోక్షనామనిమహామోహే = మోక్ష మనెడు మహామోహములో, విలీయామహే = మునిగిపోతున్నాము.
పుట 175. సంధ్యావందన= ఓ సంధ్యావందనమా! భవతేభద్రం అస్తు = నీకు శుభమగుగాక, భోఃస్నాన = ఓ స్నానమా, తుభ్యం నమః నీకు నమస్కారము, భో దేవాః పితరశ్చ = ఓ దేవతలారా! పితులారా! తర్పణవిధౌ న అహం క్షమః = =తర్పణము చేయుటకు నేను సమర్థుడనుకాను, క్షమ్యతాం = క్షమింపబడుగాక, యత్రక్వాపి = ఎక్కడో ఒకచోట, నిషద్య = కూర్చుండి, యాదవకులోత్తంసస్య బ యుదవంశ శ్రేష్ఠుడైన, కంసద్విషం = స్మారం స్మారం కంసారియగు శ్రీ కృష్ణుని స్మరించుచు, అఘం హరామి = పాపమును పోగొట్టుకుండును, తద్ అలం మన్యే = అది చాలును అని తలంచుచున్నాను, మే = నాకు, అన్యేన కిమ్ = మఱియొక దానితో పనియేమి?
పుట 186. చంద్రచూడాలచూరీ చండీదేవి = చంద్రశేఖర భాగ్యనిధానమగు చండిఅమ్మవారు. ప్రకృతి కుటిలం కల్మషం ఖండీకృత్య = స్వభావకుటిలంపాపమును పోగొట్టి శూన్యతంద్రం =అలసటలేక, నిజపదజుషాం=తన పాదపద్మములను సేవించువారలకు, ప్రాతిభశ్రీ శుండీరత్వం = ప్రతిభను, మేధను, దిశన్తీ = ప్రసాదించుచు, తుండీరాఖ్యే మహతివిషయే = తుండీర మండలమున, స్వర్ణవృష్టిప్రదాత్రీ = కనకధారను వరించుచు, రతిం కలయతి = ప్రేమానుగ్రహమును చూపుచున్నది.
|